
- ప్లాంట్ సేఫ్టీ మెజర్స్ అధ్వాన్నం
- ప్రమాదం జరిగితే యాక్షన్ ప్లాన్ లేదా?
- అలారం ఎందుకు మోగలేదు..
- ఎమర్జెన్సీ లైటింగ్, ప్రొటెక్షన్ డోర్లు లేవా?
- అందరికీ సమానంగా పరిహారం ఇవ్వాలి
- ఎనర్జీ, పవర్ సెక్టార్లలో శర్మ ఎక్స్పర్ట్స్
శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్నో అను మానాలు ఉన్నాయని , దీనిపై నిజాలు తేలాలన్నా, భవిష్య త్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా.. వెంటనే ఇండిపెండెంట్ విచారణ జరిపించాలని కేంద్ర ఇంధన శాఖ మాజీ సెక్రెటరీ ఈఏఎస్శర్మ డిమాండ్ చేశారు. పవర్‌ప్లాంట్‌లో సేఫ్టీ మెజర్స్ అధ్వానంగా ఉన్నాయని, అందువల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంపై ‘వెలుగు’ ఎత్తిచూపిన అంశాలు, సందేహాలనే ఈఏఎస్ శర్మ సీఎంకు రాసిన లెటర్లో ప్రస్తావించారు. ప్లాం ట్లో వ్యవస్థలన్నీ ఫెయిలవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ లెటర్ రా సిన ఈఏఎస్‌శర్మ 1965 బ్యాచ్ ఐఏఎస్‌అధికారి. ఉమ్మడి ఏపీలో పలు కీలక హోదాల్లోపనిచేశారు. కేంద్రంలో పవర్, ఫైనాన్యషి ల్ డిపార్ట్మెంట్లకు సెక్రెటరీగా.. అంతకుముందు ప్లానింగ్ కమిషన్లో ఎనర్జీ విభాగానికి ప్రిన్సిపల్ అడ్వైజర్‌గా పనిచేశారు. ప్రమాదంలో మరణించిన అందరి కుటుంబాలకు సమానంగా పరిహారం ఇవ్వాలని ఈఏఎస్ శర్మ డిమాండ్ చేశారు. జీవితాలను త్యాగం చేసినవారి హోదాలు, సామాజిక స్థితిగతుల ఆధారంగా పరిహారం ప్రకటించడం సరికాదని స్పష్టం చేశారు.
ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేదా?
శ్రీశైలం పవర్‌ప్లాంట్ అంతర్జాతీయ ఫైర్‌సేఫ్టీ మెజర్స్ మేరకు లేదని.. రక్షణ చర్యలు చేపట్టడంలో జెన్‌కో తీవ్రంగా విఫలమైందని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఎన్‌ఎఫ్‌పీఏ నిబంధనలను ఈ ప్లాంట్ లో ఏమాత్రం పాటించలేదని, అందుకే ఇంతటి విపత్తు సంభవించిందని తెలిపారు. ‘‘పవర్‌ప్లాంట్ లో మంటలు మొదలైన వెంటనే ఎంప్లాయీస్ను అలర్ట్ చేసేందుకు అలారం మోగలేదు . అసలు ప్లాంట్ లో పొగ, వేడిని గుర్తించే డిటెక్టర్లు ఉన్నాయా? ప్లాంట్ కు పొంచి ఉన్న అగ్నిప్రమాద ముప్పుపై కనీసం అంచనా కూడా వేయలేదు. అగ్ని ప్రమాదాలు, భారీగా నీళ్లు చొరబడటం వంటి అత్యవసర పరిస్థితులు వస్తే ఎలా రక్షించుకోవాలన్న దానిపై ఎలాంటి యాక్షన్‌ప్లాన్ లేదు” అని స్పష్టం చేశారు. ప్యా నల్‌లో మంటలు వచ్చిన వెంటనే ఎంప్లాయీస్ పోరబు్ట ల్‌ఎగ్జాస్ట రతో ్ల మంటలు ఆర్పేందుకు ప్రయత్నించా రని గుర్తు చేశారు. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాల్లో ప్రతి 30 సెకండ్లకు మంటలు రెట్టిం పు అవుతూ ఉంటాయని, దీనిపై ఎంప్లాయీస్కు అవగాహన లేదని, వారికి ఫైర్ సైన్స్‌లో శిక్షణ ఇవ్వకపోవడంతోనే ఇలా జరిగిం దని వివరించారు. మంటలను ఆర్పేందుకు ప్రయ త్నిస్తూ వారు ప్లాంట్‌లోపలే ఉండిపోయారని, ఆ మంటలను కంట్రోల్‌చేయలేమనే అవగాహన ఉంటే బయటపడి ప్రాణాలు రక్షించుకునే వారని తెలిపారు. పవర్‌ప్లాంట్ లో ఫైరింజిన్‌ఉన్నా మంటలు ఆర్పడానికి ఉపయోగించలేదన్నా రు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలో స్టాఫ్ కు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని, ఇక్కడ అలాంటి ట్రైనింగ్ ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు.
అన్నీ ఎలా ఫెయిలయ్యాయి?
ప్లాంట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే తప్పించుకోవడానికి ప్రతి ఫ్లోర్‌కు రెండు ఆల్ట ర్నేటివ్ మార్గాలు ఉండాలని ఈఏఎస్ శర్మ స్పష్టం చేశారు. ప్లాంట్‌లో అలారం మోగాక స్టాఫ్ అంతా బయటపడటానికి గంటన్నర పాటు ఎమర్జెన్ర్జె సీ లైటింగ్ ఉండాలన్నారు. లోపల చిక్కుకున్న వారిని మంటలు, పొగ నుంచి రక్షించడానికి ప్లాంట్‌లో టూ హవర్‌ఫైర్‌రేటింగ్ ప్రొటెక్షన్‌డోర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని.. కానీ శ్రీశైలం ప్లాం ట్లో అలాంటివి లేవని తెలిపారు. నిజానికి ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ షట్డౌన్ అయి.. వెంటిలేషన్, లైటింగ్‌కోసం స్టాండ్ బై పవర్‌ఆన్‌కావాల్సిఉందని గుర్తు చేశారు. ఇవన్నీ ఫెయిల య్యాయని తెలిపారు. పవర్‌ప్లాంట్ లోపలి ఆయిల్స్‌తో మంటలు మరింతగా వ్యాపించాయని, దాంతో పొగ పెరిగి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలకుముప్పు తెచ్చిందని వివరించారు.
నిజాలేంటో తేల్చాలి
శ్రీశైలం ప్లాంట్ ప్రమాదంలో జెన్‌కో వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని శర్మ తెలిపారు. ఫైర్ సేఫ్టీ, అగ్ని ప్రమాద అంచనా, విద్యుత్ ఉత్పత్తి విభాగాలకు సంబంధించిన ఇండిపెండెంట్ నిపుణులు, సంస్థతో దర్యాప్తు జరిపించాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే.. నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారందరి కుటుంబాలకు సమానంగా పరిహారం ఇవ్వాలన్నారు. తమ జీవితాలనుత్యాగం చేసిన వారి హోదాలు, సామాజిక స్థితి ఆధారంగా పరిహారం ప్రకటించడం సరికాదని.. చావులోనైనా మనుషులను సమానంగా చూడాలని సీఎం కేసీఆర్‌కు సూచించారు.