హైదరాబాద్ లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

V6 Velugu Posted on Jun 04, 2021

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచే కాస్తా..వెదర్ కూల్ గా మారింది. సాయంత్రం వర్షం కురిసింది. జీడిమెట్ల, షాపూర్, సూరారం, హకీంపేట, రామంతపూర్, ఎల్బీ నగర్, నాగోల్, కవాడిగూడ, విద్యానగర్,ఉప్పల్, చిక్కడపల్లి, చింతల్, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మేడిపల్లి, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ వనస్థలిపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షం పడింది. రాగల రెండు,మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉండటంతో.. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో.. మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. 
 

Tagged Hyderabad, Heavy rains, Many parts inundated

Latest Videos

Subscribe Now

More News