నవంబర్ 6 నుంచి 12 వరకు పలు రైళ్లు రద్దు

నవంబర్  6 నుంచి  12 వరకు  పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్​, వెలుగు: విజయవాడ డివిజన్​ పరిధిలో ట్రాక్​ పనుల కారణంగా పలు రైళ్లను సోమవారం నుంచి ఈనెల12వ తేదీ వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్​– -విశాఖపట్నం,- విజయవాడ- – విశాఖ పట్నం, మచిలీపట్నం- –విశాఖ పట్నం-– గుంటూరు-– రాయగడ-  మధ్య నడిచే రైళ్లను రద్దు చేశామని,ఆయా రూట్లలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 

దీపావళికి స్పెషల్​ రైళ్లు

దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్​– -కటక్​ మధ్య దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు నడుపుతుంది. ఈనెల 7,14,21 తేదీల్లో  హైదరాబాద్​– -కటక్​, అలాగే 8,15, 22 తేదీల్లో కటక్​ – -హైదరాబాద్​కు  స్పెషల్​రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు  వినియోగించుకోవాలని సూచించారు.