
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. అలాంటి వేళ చెత్త కుప్పలో.. కుప్పగా పడి ఉన్న ఓటర్ ఐడీలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారి.. ఆ ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకొని.. సీజ్ చేశారు.ఈ ఘటన మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో చోటు చేసుకుంది.
చెత్త కుప్పలో ఓటర్ ఐడీల అంశంపై విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్పంచాల్ వెల్లడించారు.ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. అయితే ఈ ఓటర్ ఐడీ అడ్రస్ గల చిరునామా ఆధారంగా దర్యాప్తు చేస్తామని వివరించారు. ఇక సదరు ఓటర్లకు కొత్త ఓటర్ ఐడీ కార్డులను ఎన్నికల సంఘం జారీ చేసిందని తెలిపారు. ఈ ఓటర్ ఐడీలు ఇక్కడ పడవేయడం వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా? వీటిని ఎక్కడ నుంచి తీసుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్ వివరించారు.