బీజాపూర్లో మరో ఎన్కౌంటర్... మావోయిస్టు మృతి

బీజాపూర్లో మరో ఎన్కౌంటర్... మావోయిస్టు మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలో శనివారం మరో ఎన్​కౌంటర్​ జరగగా, ఓ మావోయిస్టు చనిపోయాడు. జిల్లాలోని మాంకేళీ అడవుల్లో కూంబింగ్​ చేస్తున్న బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టు డెడ్​బాడీతో పాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మృతుడిని గుర్తించాల్సి ఉంది. శుక్రవారం గంగులూరు అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​ మృతులను గుర్తించినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్​ తెలిపారు. పొడియం హిడ్మా(34), మున్నా మడకం(25)గా గుర్తించారు. వీరిద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు  ఉన్నట్లు తెలిపారు.

స్మారక స్తూపం కూల్చివేత

ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లాలో శనివారం మావోయిస్టుల స్మారక స్తూపాన్ని జవాన్లు కూల్చివేశారు. పార్తాపూర్​ పోలీస్​స్టేషన్  పరిధిలోని పట్టేపూర్​ అడవుల్లో కూంబింగ్​ చేస్తున్న బీఎస్ఎఫ్​ జవాన్లు 14 అడుగుల భారీ స్తూపాన్ని గుర్తించి నేలమట్టం చేశారు. గత ఏడాది ఎన్​కౌంటర్​లో చనిపోయిన కమాండర్​ నగేశ్​​స్మారక స్తూపాన్ని మావోయిస్టులు నిర్మించారు.