మావో యిస్టు నేత సాంబయ్య సరెండర్

మావో యిస్టు నేత సాంబయ్య సరెండర్

భద్రాచలం: మావోయిస్టు పార్టీ ఒడిశా రాష్ట్ర కార్యదర్శి, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ ఆదివారం మహాసముంద్ జిల్లా సరైపాలీ సమీపంలోని బలోడా అడవుల నుంచి బయటకు వచ్చి లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 14 మంది మావోయిస్టులు  ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీరిపై రూ.73 లక్షల రివార్డు ఉండగా, సాంబయ్యపై ప్రభుత్వం రూ.25 లక్షల బహుమతి ప్రకటించింది. 1985 నుంచి ఉద్యమంలో ఉన్న 57 ఏళ్ల సాంబయ్య హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామానికి చెందినవాడు. ఒక జర్నలిస్టు స్థానిక పోలీసులతో మధ్యవర్తిత్వం చేయడంతో సాంబయ్య తన అనుచరులతో కలిసి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. 

కేంద్ర హోం శాఖ చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కొనసాగుతున్న కూంబింగ్ చర్యల ఒత్తిడితో 9 మంది మహిళలు, ఆరుగురు పురుషులు లొంగిపోయారనిఅధికారులు పేర్కొన్నారు. సాంబయ్యతోపాటు లొంగిపోయిన వారిలో మంగేశ్​, బాబూ, మనోజ్​, ప్రమీలా, కరుణ, రోజా, రోష్నీ, రాధిక, మీన, దీపన, రీన, సోనూ, పాండూ, రనీలా ఉన్నారు.  వారికి పునరావాస సహాయం అందజేస్తామని పోలీసులు తెలిపారు.