
మావోయిస్టు లింగన్న మృతదేహాన్ని హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. రీ పోస్టుమార్టం చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో.. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుంచి గాంధీ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ముగ్గురు సీనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం చేయనున్నారు.
ఆ తర్వాత మృతదేహాన్ని లింగన్న బంధువులకు అప్పగించనున్నారు. రీ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టును సీల్డ్ కవర్ లో ఈ నెల 5వ తేదీ వరకు హైకోర్టుకు అందజేయనున్నారు అధికారులు.