మావోయిస్టు మల్లా రాజిరెడ్డి చనిపోలేదు.. అదంతా పోలీసుల కుట్ర

మావోయిస్టు మల్లా రాజిరెడ్డి చనిపోలేదు.. అదంతా  పోలీసుల కుట్ర

మావోయిస్టు మల్లా రాజిరెడ్డి అలియాస్ అలియాస్ సాయన్న చనిపోలేదని ప్రకటించింది మావోయిస్టు పార్టీ. అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), కట్ట రామచంద్రారెడ్డి చనిపోయినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఆ పార్టీ ఉత్తర సబ్ జోనల్ దండకారణ్య అధికార ప్రతినిధి మంగ్లీ పేరిట ప్రకటన రిలీజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో తమ నేతల ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ఆడిన కుట్రలో భాగమేనని వెల్లడించారు. ఇద్దరు మావోయిస్ట్ నేతలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.

మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న అనారోగ్యంతో చనిపోయినట్లు ఆగస్టు 18న  ప్రచారం జరిగింది.  అయితే అదంత తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు పాలకులు పన్నిన కుట్ర అంటూ మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

మల్లా రాజిరెడ్డి స్వస్థలం బీజాపూర్ జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్ పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి.  ఆయన వయసు ప్రస్తుతం 70 ఏళ్లు.  రాజిరెడ్డిపై కోటి రూపాయల నజరానా ప్రకటించింది చత్తీస్ గఢ్ ప్రభుత్వం. ఛత్తీస్ గఢ్, ఒరిస్సా దండకారణ్యంలో కీలకంగా వ్యవహారించారు మావోయిస్టు రాజిరెడ్డి.