వరి పొలంలో ఇండియా మ్యాప్

వరి పొలంలో ఇండియా మ్యాప్

వరి పొలంలో భారతదేశ పటాన్ని రూపొందించి శభాష్ అనిపించుకుంటున్నాడు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ రైతు. చొప్పదండి  మండలం పెద్దకుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ రెడ్డి.. ఇప్పటికే పంటల సాగులో వినూత్న ప్రయోగాలు చేసి జాతీయ ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు. తాజాగా.. దేశభక్తిని చాటుతూ తన పొలంలో భారతదేశ పటాన్ని రూపొందించాడు. వరిపొలంలో ఇండియా పటం ఆకృతిలో మొక్కలు పెంచడంతో.. అది అందరినీ ఆకట్టుకుంటోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా.. తన పొలాన్ని దేశభక్తికి ప్రతీకగా తీర్చిదిద్దినట్లు మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.