మ్యాపింగ్ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా

మ్యాపింగ్ ప్రక్రియ స్పీడప్ చేయాలి : కలెక్టర్ చిత్రా మిశ్రా
  •       కలెక్టర్ చిత్రా మిశ్రా 

కరీంనగర్ టౌన్,వెలుగు:  కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్య సాధన దిశగా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్​ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మ్యాపింగ్ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రతి దశను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి ఎలాంటి జాప్యం లేకుండా పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఫీల్డ్ స్థాయిలో పర్యవేక్షణను బలోపేతం చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

అనంతరం డబుల్ బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన కలెక్టర్, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పద్మనగర్, ఆరేపల్లి ప్రాంతాల్లో నిర్మించిన ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు అవసరమైన విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.