మరిపెడ అభివృద్ధికి కృషి చేయండి : శ్రీపాల్ రెడ్డి

మరిపెడ అభివృద్ధికి కృషి చేయండి : శ్రీపాల్ రెడ్డి

మరిపెడ, వెలుగు: మరిపెడ మున్సిపాలిటీలో నూతన కార్యవర్గం కొలువుదీరింది. చైర్‌పర్సన్‌గా విసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్​పర్సన్‌గా కాలం సునీత రవీందర్ రెడ్డి సోమవారం ఎన్నికయ్యారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్‌, వైస్​చైర్​పర్సన్, కౌన్సిలర్లు ప్రభుత్వ విప్, డోర్నకల్​ఎమ్మెల్యే రామచంద్రునాయక్​సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.​ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరిపెడ పట్టణ సమగ్ర అభివృద్ధికి నూతన పాలకమండలి కృషి చేయాలని సూచించారు.