స్టాక్ మార్కెట్‌‌‌‌ జూమ్.. రూ.16 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

స్టాక్ మార్కెట్‌‌‌‌ జూమ్.. రూ.16 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • సెన్సెక్స్‌‌‌‌ 3 వేల పాయింట్లు జంప్​ 
  • యుద్ధం ఆగడంతో2,946  పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌
  • రూ.16 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
  • 92 డాలర్లకు పడిపోయిన బ్రెంట్ క్రూడ్‌‌‌‌‌‌‌‌
  • కొరియా మార్కెట్ 7 శాతం, జపాన్‌‌‌‌‌‌‌‌ 5 శాతం అప్‌‌‌‌‌‌‌‌
  • హర్మూజ్ జలసంధి ఓపెన్ కావడంతో గ్లోబల్‌‌‌‌‌‌‌‌గాబుల్లిష్‌‌‌‌‌‌‌‌ ట్రెండ్‌‌‌‌‌‌‌‌

అమెరికా– ఇరాన్​ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణతో మార్కెట్‌‌‌‌ దూసుకుపోయింది. సెన్సెక్స్‌‌‌‌, నిఫ్టీ మూడున్నర శాతం పెరిగాయి. ఇన్వెస్టర్ల సంపద రూ.16.25 లక్షల కోట్లు పెరిగింది. ఆయిల్ ధరలు 100 డాలర్లు దిగువకు రావడం, గ్లోబల్‌‌‌‌ మార్కెట్లు ర్యాలీ చేయడం కలిసొచ్చింది.  నిఫ్టీ బుధవారం  874 పాయింట్లు పెరిగి 23,997 వద్ద సెటిలవ్వగా,  సెన్సెక్స్‌‌‌‌ 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద ముగిసింది. అయితే మార్కెట్ పెరిగినా ఎఫ్‌‌‌‌ఐఐల అమ్మకాలు మాత్రం ఆగలేదు. వీరు బుధవారం సెషన్‌‌‌‌లో ఫారిన్​ ఇన్వెస్టర్లు నికరంగా రూ. 2 వేల కోట్ల షేర్లను అమ్మారు. ఆయిల్ ధరలు తగ్గడంతో రూపాయి బలపడింది. డాలర్‌‌‌‌‌‌‌‌తో 47 పైసలు బలపడి రూ. 92.59 కి చేరింది.

ముంబై: మార్కెట్‌‌‌‌‌‌‌‌లో బుల్స్ రంకెలేశాయి. ఇరాన్‌‌‌‌‌‌‌‌– అమెరికా మధ్య యుద్ధం తాత్కాలికంగా ఆగడంతో షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. బెంచ్‌‌‌‌‌‌‌‌మార్క్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ మూడున్నర శాతం పెరిగాయి.  ఇన్వెస్టర్ల సంపద రూ.16.25 లక్షల కోట్లు ఎగిసింది. ఆయిల్ ధరలు 100 డాలర్లు దిగువకు  రావడం, గ్లోబల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు ర్యాలీ చేయడం కలిసొచ్చింది.  

నిఫ్టీ బుధవారం  874 పాయింట్లు పెరిగి 23,997 వద్ద సెటిలవ్వగా,  సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌ 2,946 పాయింట్ల లాభంతో 77,562 వద్ద ముగిసింది.  బీఎస్‌‌‌‌‌‌‌‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16.25 లక్షల కోట్లు పెరిగి రూ.446 లక్షల కోట్లకు చేరుకుంది. మార్కెట్ పెరుగుతున్నా,   ఫారిన్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఐల) అమ్మకాలు మాత్రం ఆగడం లేదు. వీరు బుధవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో నికరంగా రూ. రెండు వేల కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  

ఈ షేర్లు జూమ్‌‌‌‌‌‌‌‌..

మిడిల్‌‌‌‌‌‌‌‌ఈస్ట్‌‌‌‌‌‌‌‌లో ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పేస్ తిరిగి ఓపెన్ అయ్యే అవకాశం ఉండడంతో ఇండిగో షేర్లు బుధవారం 10 శాతం పెరిగాయి. సెన్సెక్స్‌‌‌‌‌‌‌‌లో టాప్‌‌‌‌‌‌‌‌ గెయినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయి. ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, బజాజ్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌, బజాజ్ ఫిన్సర్వ్‌‌‌‌‌‌‌‌, అల్ట్రాటెక్ సిమెంట్, మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌,  ఎటర్నల్‌‌‌‌‌‌‌‌,హెచ్‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ  బ్యాంక్ షేర్లు కూడా 5–7 శాతం లాభపడ్డాయి. ఒక్క టెక్ మహీంద్రా మాత్రమే రెడ్‌‌‌‌‌‌‌‌లో ముగిసింది. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే నిఫ్టీ విక్స్ ఇండెక్స్ ఏకంగా 20 శాతం పతనమై 19.70 లెవెల్‌‌‌‌‌‌‌‌కి పడిపోయింది. అన్ని సెక్టార్ల ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు బుధవారం భారీగా పెరిగాయి. ముఖ్యంగా నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆటో 7 శాతం చొప్పున లాభపడ్డాయి.  నిఫ్టీ పీఎస్‌‌‌‌‌‌‌‌యూ బ్యాంక్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ కన్జూమర్ డ్యూరబుల్స్‌‌‌‌‌‌‌‌, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు 5 శాతానికి పైగా పెరిగాయి.

 మిడ్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ షేర్లకూ లాభాలు

మిడ్‌‌‌‌‌‌‌‌, స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ షేర్లు కూడా బుధవారం ర్యాలీ చేశాయి. నిఫ్టీ మిడ్‌‌‌‌‌‌‌‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌‌‌‌‌‌‌‌ క్యాప్ 100 ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లు 4 శాతం చొప్పున పెరిగాయి. ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఈలో  మొత్తం 2,960 షేర్లు లాభాల్లో ముగియగా, 341 షేర్లు నష్టపోయాయి.  నిఫ్టీ 500 కంపెనీల్లో  చోళమండలం ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ హోల్డింగ్స్‌‌‌‌‌‌‌‌ 16 శాతం, అశోక్ లేలాండ్‌‌‌‌‌‌‌‌ 13శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 12 శాతం, ఫోర్స్‌‌‌‌‌‌‌‌ మోటార్స్ 11 శాతం, పైన్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్స్‌‌‌‌‌‌‌‌ 11 శాతం, బంధన్ బ్యాంక్ 11 శాతం లాభపడ్డాయి. శ్రీరామ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ 10 శాతం, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ 10 శాతం పెరిగాయి. 

ర్యాలీకి కారణాలు..

ఇరాన్‌‌‌‌‌‌‌‌–అమెరికా మధ్య సీజ్‌‌‌‌‌‌‌‌ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇరాన్‌‌‌‌‌‌‌‌–అమెరికా మధ్య యుద్ధం తాత్కాలికంగా ఆగింది. రెండు వారాల పాటు కాల్పులు విరమించేందుకు అమెరికా ఒప్పుకుంది. ఇరాన్ నుంచి 10 పాయింట్ల ప్రపోజల్‌‌‌‌‌‌‌‌ను అందుకున్నామని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. వీటిపై  చర్చించేందుకు పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదని అన్నారు. ఆయన కామెంట్స్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌కు పెద్ద రిలీఫ్ ఇచ్చాయి. అంతకుముందు  హోర్మూజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే ఇరాన్‌‌‌‌‌‌‌‌ను భూమిమీద లేకుండా చేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.  

దిగొచ్చిన ఆయిల్‌‌‌‌‌‌‌‌ క్రూడాయిల్ ధరలు .. బుధవారం 16 శాతం తగ్గాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 92 డాలర్లకు దిగొచ్చింది. అమెరికా క్రూడాయిల్ డబ్ల్యూటీఐ 17 శాతం పడి 94 డాలర్లకు చేరింది. ఆయిల్ ధరలు తగ్గితే ఇండియాకు మేలు. 

పడిన బాండ్‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు..   అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌ 4.24 శాతానికి తగ్గగా, 30 ఏళ్ల బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌ 4.84 శాతానికి. 2 ఏళ్ల బాండ్‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌ 3.73 శాతానికి  చేరాయి. బాండ్ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు తగ్గితే ఇండియా నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లడం తగ్గుతుంది. 

గ్లోబల్ మార్కెట్లు పైకి..    

హోర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తామని ఇరాన్ ప్రకటించడంతో  గ్లోబల్ మార్కెట్లు భారీగా పెరిగాయి. జపాన్‌‌‌‌‌‌‌‌ నిక్కీ 5.39 శాతం, కొరియా కొస్పీ 7 శాతం, చైనా షాంఘై కంపోజిట్ ఇండెక్స్ 2.69 శాతం, హాంకాంగ్‌‌‌‌‌‌‌‌ హంగ్‌‌‌‌‌‌‌‌సెంగ్‌‌‌‌‌‌‌‌ 3 శాతం లాభపడ్డాయి.  ఫ్రాన్స్ సీఏసీ 40 ఇండెక్స్ 5 శాతం, యూకే ఎఫ్‌‌‌‌‌‌‌‌టీఎస్‌‌‌‌‌‌‌‌ఈ 100 3 శాతం, జర్మనీ డాక్స్‌‌‌‌‌‌‌‌ 5.38 శాతం పెరిగాయి. యూఎస్ ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్లు కూడా 3 శాతం లాభపడ్డాయి.  

బలపడిన రూపాయి  

ఆయిల్ ధరలు తగ్గడంతో రూపాయి బలపడింది. డాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 52పైసలు బలపడి 92.54 కి చేరింది. ఇండియన్ కరెన్సీ ఈ మధ్య 95 వరకు క్షీణించిన విషయం తెలిసిందే. ఆర్‌‌‌‌బీఐ చర్యలతో  పుంజుకుంటోంది.

షార్ట్ టర్మ్‌‌లో బుల్ రన్‌‌?

అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదర డంతో షార్ట్ టెర్మ్‌‌‌‌‌‌‌‌లో మార్కెట్ పరిస్థితి మారింద ని జియోజిత్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఆయిల్ ధరలు పడడంతో మార్కెట్ బుల్లిష్‌‌‌‌‌‌‌‌గా మారిందని చెప్పారు. హార్మూజ్ జల సంధి ఓపెన్ కావడంతో  బుల్స్ ఆధిపత్యం కొనసా గుతుందని అన్నారు.  

‘‘ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ పాలసీ న్యూట్రల్‌‌‌‌‌‌‌‌ వైఖరితో ఉంది. ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి తగ్గడం వంటి రిస్క్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ వీటిని బాగా మేనేజ్ చేస్తోంది.  రూపాయి బలపడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగొచ్చే అవకాశం ఉంది”అని ఆయన వివరించారు.