పూర్తి పారదర్శకంగా మక్కల వేలం మార్క్‌‌ఫెడ్ వివరణ

పూర్తి పారదర్శకంగా మక్కల వేలం మార్క్‌‌ఫెడ్ వివరణ

హైదరాబాద్​, వెలుగు: మక్కల వేలం పాటను పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామని మార్క్‌‌ఫెడ్ స్పష్టం చేసింది. ఈ నెల 13న ‘వెలుగు’ దినపత్రికలో “మక్కల వేలం.. వ్యాపారులకే లాభం?” అనే శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఒక ప్రకటనలో స్పందించారు. కనీస ధర (బేస్ ప్రైస్), ఈఎండీ, లాట్ వివరాలు తదితర అన్ని నిబంధనలను టెండర్ డాక్యు మెంట్లలో ముందుగానే స్పష్టంగా పొందుపరి చామని తెలిపారు.

బేస్ ప్రైస్ ఖరారు చేయకుం డానే టెండర్లు నిర్వహిస్తున్నామనే ప్రచారంలో  వాస్తవం లేదన్నారు. వ్యాపారులు నిర్దేశిత ఈఎండీ చెల్లించిన తర్వాత మాత్రమే బిడ్డింగ్‌‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. పూర్తిస్థాయి పోటీ తత్వంతోనే బిడ్లను స్వీకరిస్తున్నామని, వేలం ప్రక్రియపై ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.