జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎప్పటికప్పుడు.. గ్రహాలు వాటి సంచారాన్ని మారుస్తూ ఉంటాయి. అలా మారినప్పుడు 12 రాశుల వారి జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. 2025, నవంబర్19వ తేదీ రాత్రి 7 గంటల 40 నిమిషాలకు.. బుధ గ్రహం అధిపతి కుజుడు నక్షత్రం మారతాడు. ప్రస్తుతం అనురాధ నక్షత్రంలో ఉన్న కుజుడు.. నవంబర్ 19వ తేదీ రాత్రి జ్యేష్ఠ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. 2025 డిసెంబర్7వ తేదీ వరకు.. అంటే రెండు వారాలుపైనే.. జ్వేష్ఠ నక్ష్రతంలో ఉంటాడు కుజుడు. ఈ మార్పుతో.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 12 రాశుల్లోని మూడు రాశుల వారికి గోల్డెన్ పిరియడ్ అని చెబుతున్నారు. కుజుని నక్షత్ర మార్పు ..ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం...
మేషరాశి:కుజుడు.. జ్యేష్ఠా నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి వృత్తిపరంగా అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎట్టి పరిస్థితిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భూలావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆర్థిక పరంగా ఇబ్బంది లేకపోయినా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
వృషభ రాశి : ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి. అధిక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
మిథున రాశి : ఈ రాశి వారికి కుజుడి నక్షత్రం మార్పు బాగా కలిసి వస్తుంది. ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు కావడంతో ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు అధికంగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పులు లాభాలు వస్తాయి. ముఖ్యమైన పనులను సక్రమంగా పూర్తి చేస్తారు. పనికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. పూర్వీకుల ఆస్థి కలసి వస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది.
కర్కాటకరాశి: ఈ రాశి వారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ, కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. అనుకోని మార్గాల్లో ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపారులకు తలపెట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనల ప్రభావం మనస్సుపై ఉండవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
సింహ రాశి : ఈ రాశి వారు డిసెంబర్ 7 వ తేది వరకు నూతనోత్సాహంతో ఉంటారు. అనుకున్న పనులు వెంటనే చకాచకా పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసే ప్రయాణాలు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగస్తుల పనితీరుకు మెచ్చిర ఉన్నతాధికారులు అవార్డులు అందజేస్తారు. ఆర్థికంగా స్థిరత్వం లభించి, భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారికి జ్యేష్ఠ్యా నక్షత్రంలో కుజుడి సంచారం ఎంతో మేలు చేస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఆర్థికంగా ఇది ఒక అద్భుతమైన సమయం. ఊహించని మార్గాల నుంచి ధనలాభాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అనుకోకుండా ధనలాభం.. పాత అప్పులు తీరే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వీఆరోగ్యం విషయంలో మాత్రం అస్సలు అశ్రద్ధ చేయవద్దని పండితులు చెబుతున్నారు.
తులా రాశి : ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఖర్చులు తగ్గుముఖం పడతాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపడుతారు. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. వీరు జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును చూస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృశ్చికరాశి: జ్యేష్ఠ నక్షత్రంలో కుజ సంచారం వలన ఈ రాశి వారికి అన్ని విధాల కలిసొస్తుంది. గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు . వీరిలో నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి . కెరీర్ విషయంలో మంచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి గణనీయమైన లాభాలను పొందుతారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారి కల నెరవేరుతుంది. వ్యాపారస్తదులకు అధికంగా లాభాలు వస్తాయి. ప్రేమ.. పెళ్ళి వ్యవహారాలు కలసి వస్తాయి.
ధనుస్సు రాశి: కుజుడు సంచారంలో మార్పు వలన ఈ రాశి వారికి సామాజికంగా .. వృత్తి పరంగా అభివృద్ది చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. సుదూర ప్రయాణానికి కూడా అవకాశం ఉంది.కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వాళ్లకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి కూడా బాగుంటుంది. పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రావచ్చు. పెళ్లయిన వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మకర రాశి : ఈ రాశి వారికి కుజుడు నక్షత్రం మార్పు బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో విదేశీ ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొనసాగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. కెరీర్ కూడా బాగుంటుంది. అదృష్టం పెరుగుతుంది. అనేక విధాలుగా లాభాలను పొందుతారు. ఉద్యోగంలో కీలకబాధ్యతలు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. గతంలో నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
కుంభ రాశి: కుజుడు జ్యేష్ఠ్యా నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి కెరీర్ పరంగా ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. కుజుడు.. చంచల స్వభావం కనుక .. నిర్ణయం తీసుకోవడంలో కొంత జాప్యం కలుగుతుంది. కుటుంబంలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉంటాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు అందరి ఆమోదం లభిస్తుంది. కొత్త వ్యాపారాలు కలసి వస్తాయి. గతంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావడంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.
మీన రాశి : ఈ రాశి వారు అపారమైన తెలివితేటలతో ఏ సమస్యనైనా సులభంగా అధిగమిస్తారు. కొంతమంది వాదించే అవకాశం ఉంది. మీరు అలాంటి వారికి దూరంగా ఉండండి. పూర్వీకుల నుంచి ఆస్తులు పొందే అవకాశం ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సానుకూల మార్పులను చూస్తారు. వ్యాపారులకూ ఇది బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి విశ్రాంతి తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
