పెరుగుతున్న కరోనా కేసులు.. లైట్ తీసుకుంటున్న జనాలు

పెరుగుతున్న కరోనా కేసులు.. లైట్ తీసుకుంటున్న జనాలు

రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. గత రెండున్నర ఏళ్లుగా మాస్క్ లు, శానిటైజర్ల వినియోగం, సోషల్ డిస్టెన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు పబ్లిక్. ఆ తర్వాత కోవిడ్ వ్యాక్సినేషన్ తో రిలాక్స్ అయ్యారు. అయితే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కు డిమాండ్  పెరిగింది. అయితే మళ్లీ కరోనా కేసుల నమోదుతో అలర్ట్ గా ఉండాలంటున్నారు డాక్టర్లు. కొన్ని చోట్ల మాస్క్ లు, జనరల్ డిసీజ్ లకు సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ కు మళ్లీ గిరాకీ వచ్చిందంటున్నారు మెడికల్ షాప్ నిర్వాహకులు. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ప్రస్తుతం స్కూళ్లకు వెళ్లే పిల్లలు కచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ సోకుతుండడంతో... ఇమ్యూనిటి కోసం బూస్టర్ డోస్ కూడా వేసుకోవాలంటున్నారు. ప్రస్తుతం సిటీలో కరోనాను లైట్ తీసుకుంటున్నారు జనాలు.

ఎక్కడా జాగ్రత్తలు పాటించడం లేదు. మరోవైపు సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. జలుబు, దగ్గు, సైనస్ కేసుల సంఖ్య పెరిగింది. రెయినీ సీజన్ లో జలుబుతో పాటు దగ్గు కామన్ గా వస్తుంటాయి. ఇంకో వేవ్ లాగా వస్తుందనే అనుమానాలున్నా... ఇప్పుడు వచ్చే కోవిడ్ కేసుల అంత తీవ్రత ఉండకపోవచ్చని అంటున్నారు డాక్టర్లు. బీపీ, షుగర్లు, కిడ్నీ పేషంట్స్, ఇతర అనారోగ్యంగా ఉన్నవారు ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, ఉన్నవారు మాస్క్ లు ధరించడం, హోం మేడ్ ఫుడ్, వేడి వేడిగా ఉండే  ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. కోవిడ్ వ్యాక్సినేషన్ తో పాటు సేఫ్టీ పరంగా అంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో  కరోనా సోకినా... భయపడకుండా హెల్త్ కేర్ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.