తుఫాన్ అంటే బలమైన గాలులు.. ఆ వెంటనే వర్షాలు.. వర్షంతో కూడిన గాలుల బీభత్సం ఉండటం చూస్తుంటాం. కానీ ముంబైలో వస్తున్న గాలి తుఫాన్ అందుకు పూర్తి భిన్నంగా.. దుమ్ము, ధూళితో ఏదో ఎడారి ప్రాంతంలో వచ్చే తుఫాన్ మాదిరిగా అతలాకుతలం చేస్తోంది. 2026 మే 7వ తేదీ సాయంత్రం మొదలైన దుమ్ము తుఫాన్.. నగరం కనబడకుండా కమ్మేసింది.
ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లోని కళ్యాణ్, ములుంద్ రాంతాల్లో తుఫాన్ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రహదారులన్నీ దుమ్ముతో నిండిపోయాయి. ఎదురుగా వచ్చే వాహనాలు కనపడకుండా.. పక్కపక్కన ఉన్న ఇళ్ళు కూడా కనపడకుండా ఘోరమైన ధూళి ఆవరించింది. దీనికి సంబంధించిన వీడియోలను స్థానికులు షేర్ చేస్తున్నారు.
►ALSO READ | అద్దంలో చూసైనా బుద్ధి రావాలి ! పబ్లిక్ ప్లేస్లో యూరిన్ చేసే వారికోసం అధికారుల కొత్త ఐడియా.. వీడియో వైరల్
వాతావరణ కేంద్రం హెచ్చరికల ప్రకారం.. తుఫాన్ ముందుగా తూర్పు శివారులో ఏర్పడి.. ముంబై వెస్ట్ వైపు కదలటంతో థానే తదితర ఏరియాలల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముంబై రైన్స్ సోషల్ మీడియా అకౌంట్ సాయంత్రం 4.30 గంటలకు దుమ్ము తుఫాన్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. గంట రెండు గంటలు స్థానికులు బయటకు వెళ్లవద్దని సూచించింది. అనుకున్నట్లుగానే విపరీతమైన దుమ్ము కమ్ముకోవడంతో సిటీ మొత్తం ధూళితో నిండిపోయింది.
4:30 PM.. Duststorm alert for Thane & MMR for next 1 hour ⛈️⚠️
— Mumbai Rains (@rushikesh_agre_) May 7, 2026
Huge thunderstorms have formed over MMR and are heading towards Thane & Mumbai
Many parts will witness lightning and intense rains
Live visuals from Mulund ⚡
Mumbai on standby alert for next hour #MumbaiRains pic.twitter.com/DsNsBR5Jw3
