జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లోని జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కోపల్లే ఫార్మ్ కంపెనీలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని  మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  గడిచిన కొన్ని నెలలుగా మూతపడి ఉన్న పరిశ్రమలో ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడం పరిసర ప్రాంతాల వాసులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. కంపెనీలో సెక్యూరిటీ తో పాటు సిబ్బంది ఎవరైన చిక్కుకోని ఉన్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో నిషేదిత డ్రగ్స్ తయారుచేస్తూ పట్టుబడ్డ పరిశ్రమ,కంపెనీ క్రిందనుండి వ్యర్ధ రసాయానాలను నాలలోకి వదులుతున్నారన్న సమాచారం మేరకు పిసిబి,ఫైర్ సిబ్బంది కంపెనీ ని సీజ్ చేశారు.

అటు సికింద్రాబాద్ స్వప్న లోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్వప్న లోక్ కాంప్లెక్స్ లోని 7, 8వ అంస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలియగానే సంఘటనాస్థలానికి నాలుగు ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దట్టంగా అలుముకున్న పొగలతో ఫైర్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. కాంప్లెక్స్ లోపల పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వప్న లోక్ కాంప్లెక్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.