మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని  మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  టాటా నగర్ లోని  పరుపుల గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో  భయాందోళనకు గురైన స్థానికులు దూరంగా పరుగులు తీశారు. 

స్థానికుల సమాచారంతో  ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది  రెండు  ఫైరింజన్లతో నాలుగు గంటలకు పైగా శ్రమించి  మంటలను అదుపులోకి తెచ్చారు.   పరిశ్రమలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమ  నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. గోదాం యజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు పోలీసులు.