అమెరికాలో పోర్టు కార్మికులు సమ్మె బాట పట్టారు. దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో పనిచేస్తున్న 50 వేల మంది వర్కర్స్ విధులను బహిష్కరించి స్ట్రైక్ లో పాల్గొన్నారు. దీంతో అమెరికాలో ఎగుమతులు, దిగుమతులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
మంగళవారం (అక్టోబర్ 01, 2024) అర్థరాత్రి ప్రారంభమైన ఈ సమ్మె కారణంగా మైనే నుంచి టెక్సాస్ వరకు దాదాపు అన్ని కార్గో పోర్టుల రేవుల మీదుగా జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు అన్ని నిలిచిపోయాయి. అరటిపండ్లు,
యూరోపియన్ బీర్, వైన్, మద్యంతోపాటు ఫర్నిచర్, దుస్తులు, గృహోపకరణాలు, యూరోపియన్ ఆటోలు, యూఎస్ ఫ్యాక్టరీల నిర్వహణకు అవసరమైన ముడిసరుకు వంటి వాటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అమెరికన్ కంపెనీల అమ్మకాలను తీవ్రంగా దెబ్బతీసింది.
Also Read :- చూస్తుండగానే .. 25 మంది పిల్లలు చనిపోయారు
సోమవారం అమెరికాలోని వివిధ పోర్టుల్లోపనిచేసే కార్మికుల యూనియన్ (ILA)తో యూనైటెడ్ స్టేట్స్ మారిటైమ్ అలయన్స్ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె బాట పట్టారు. సోమవారం తో పోర్టుల్లో పనిచేసే కార్మికులు కాంట్రాక్టు ముగియడంతో కొత్త కాంట్రాక్టు కోసం అమెరికా ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్లు నచ్చకపోవడంతో చర్చలు విఫలమయ్యాయి.
సమ్మె ప్రభావం అమెరికా ఎగుమతులు , దిగుమతులపై తీవ్రంగా ఉంది. వినియోగదారులు, పారిశ్రామిక వస్తువుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇది ధరల పెరుగుదలకు దారితీయొచ్చు. ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసిన కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్థికవ్యవస్థపై తీవ్రప్రభావం చూపే అవకాశంఉంది.