హైదరాబాద్ లో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..

హైదరాబాద్ లో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు..

హైదరాబాద్ లో భారీ సింథటిక్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. షాద్ నగర్ లో మెఫెడ్రోన్ తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ పై కేసు నమోదు చేశారు హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు. తెలంగాణ ఈగల్ టీం సమాచారంతో ఆదివారం ( మార్చి 8 ) షాద్ నగర్ లోని సింథటిక్ డ్రగ్స్ తయారీ కేంద్రంపై దాడి చేసిన పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. SR ఇన్నోవేషన్స్ ఇండియా సంస్థ ద్వారా డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ప్రికర్సర్ కెమికల్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని... 2-Bromo-4-Methylpropiophenone వంటి కెమికల్స్ ను ఆన్ లైన్లో విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు.

ఈ కెమికల్స్ తో నిషేధిత డ్రగ్ మెఫెడ్రోన్ తయారు చేస్తున్నట్లు అనుమానిస్తున్నామని తెలిపారు పోలీసులు. ప్రధాన నిందితుడు వీరేంద్ర స్వామి అలియాస్ గిరీష్ తాపర్ సహా పలువురు నిందితులు డ్రగ్స్ తయారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. నిందితులు నకిలీ అడ్రస్‌లతో కెమికల్స్ ఆర్డర్ చేసి శాద్‌ నగర్‌లో ల్యాబ్ ఏర్పాటు చేసి డ్రగ్స్ తయారు చేస్తున్నారని తెలిపారు పోలీసులు. మొత్తం 300 కిలోల వరకు కెమికల్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైందని తెలిపారు.

హైదరాబాద్ లో తయారైన డ్రగ్స్ ను రాజస్థాన్‌కు తరలించి అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు. రాజస్థాన్‌లో పోలీసులు వీరేంద్ర స్వామి, మనీష్ బిష్ణోయ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని.. ఈ విచారణలో శాద్‌నగర్ డ్రగ్ తయారీ నెట్‌వర్క్ బయటపడిందని తెలిపారు హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీసులు.