ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్‌‌‌‌గా చూడాలి

ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్‌‌‌‌గా చూడాలి

న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్‌‌‌‌ను ఇండియాలో క్రైమ్​గా పరిగణిస్తే అత్యంత ప్రభావవంతంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌‌‌‌కు చెందిన ఓ సీనియర్ అధికారి అన్నారు. ప్రస్తుతం ఎలాంటి కఠినమైన చట్టాలు లేకపోవడంతో దోషులు తప్పించుకుంటున్నారని, శిక్ష పడటానికి చాలా టైమ్ పడుతోందని చెప్పారు. ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్స్‌‌‌‌ను క్రిమినలైజ్ చేయాలని చాలా ఏళ్లుగా వాదిస్తున్న న్యాయ నిపుణులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. బలమైన చట్టాలు లేకపోవడంతో క్రీడల్లో అవినీతిని పరిశోధించేటప్పుడు అధికారుల చేతులు కట్టివేయబడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఇండియాలో మ్యాచ్ ఫిక్సింగ్‌‌‌‌కు సంబంధించి కఠిన చట్టాలు లేవు. కాబట్టి మేం పెద్దగా చర్యలు తీసుకోలేకపోతున్నాం. ఇండియన్ పోలీసులతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఇప్పుడున్న చట్టాల వల్ల వాళ్లు ఒక చేతితోనే పని చేయాల్సి వస్తున్నది. రెండో చేతిని కట్టేసుకోవాల్సిందే. అవినీతి పరుల భరతం పట్టడానికి మేం చేయాల్సిందల్లా చేస్తున్నాం. వారు స్వేచ్ఛగా తిరగకుండా చాలా చర్యలు తీసుకుంటున్నాం. కానీ లీగలైజేషన్ అనేది ఇండియాలో పెద్ద సమస్యగా మారింది. మేం 50 పరిశోధనలు చేస్తే అందులో సగానికి పైగా ఇండియాతోనే లింక్ ఉంటాయి. కాబట్టి ఇండియాలో ఫిక్సింగ్స్‌‌‌‌ను క్రిమినలైజ్ చేస్తే క్రికెట్‌‌‌‌ను మరింత సురక్షితంగా నిర్వహించొచ్చు’ అని ఐసీసీ ఏసీయూ కో ఆర్డినేటర్ స్టీవ్ రిచర్డ్​సన్​ పేర్కొన్నారు. రాబోయే మూడేళ్లలో ఇండియాలో రెండు పెద్ద ఐసీసీ టోర్నీలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైనా దీనిపై చర్యలు చేపట్టాలని గవర్నమెంట్‌‌‌‌ను కోరారు.

For More News..

కరోనా ఎఫెక్ట్: కన్నవాళ్లు చనిపోయినా శవాన్ని ఇంటికి తీసుకెళ్లలేని పిల్లలు

రాష్ట్రంలో కరోనా టెస్టులకు బ్రేక్

రాష్ట్రంలో మరో 920 కరోనా కేసులు