- కీలక నేతలు మెహనత్, గౌరవ్ ను సైతం అదుపులోకి తీసుకున్న జార్ఖండ్ పోలీసులు
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్ అగ్రనేత, పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్బేస్రా సహా అతని ప్రధాన అనుచరులు మెహనత్అలియాస్ మోచూ, గౌరవ్‌ను జార్ఖండ్పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. ధన్బాద్ జిల్లా నుంచి గిరిడీహ్జిల్లాకు టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తుండగా తుండీ-మండియా ప్రాంతంలో జార్ఖండ్పోలీసులు, సీఆర్పీఎఫ్బలగాలు కలిసి అరెస్ట్ చేశాయి. మిసర్బేస్రా పై జార్ఖంఢ్‌లో రూ.కోటి, ఒడిశాలో రూ.1.20 కోట్ల రివార్డు ఉంది.
తన అనుచరులతో సారండా అడవుల్లో సంచరిస్తున్న మిసిర్బేస్రాను పట్టుకునేందుకు భద్రతాబలగాలు కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో భద్రతాబలగాలు తమను చుట్టు ముట్టడంతో పారిపోయేందుకు ప్రయత్నించిన మిసిర్బేస్రా అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాయి. జార్ఖండ్రాష్ట్రంలోని గిరిడీహ్జిల్లా పార్టాండ్పోలీస్స్టేషన్పరిధిలోని మదన్ డీగ్ గ్రామంలో పుట్టిన మిసిర్బేస్రా మావోయిస్టు ఉద్యమ విస్తరణలో కీలకపాత్ర పోషించారు.
జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో సాయుధ దళాలకు రెండు దశాబ్దాలుగా రాజకీయ పాఠాలు, గెరిల్లా యుద్ధతంత్రంలో ట్రైనింగ్ఇచ్చారు. కొన్నేండ్ల కింద జార్ఖండ్రాష్ట్రంలోని పశ్చిమ సింగ్భూం జిల్లా కిల్సోయ్, బలిబా అడవుల్లో మందుపాతర పేల్చి 55 మంది జవాన్లను హత్యకు పథక రచన చేసింది కూడా మిసిర్ బేస్రానే. 2009లో అతడిని అరెస్ట్ చేసి బీహార్రాష్ట్రంలోని లఖిసరాయ్కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు. అప్పటి నుంచి నేటి వరకు భద్రతాబలగాలకు చిక్కకుండా తిరుగుతున్నారు. మిసిర్ బేహ్రా పై హత్య, మందుపాతర పేలుళ్లు, ఆర్మ్డ్ యాక్ట్ , దాడులు వంటి 100కు పైగా కేసులు ఉన్నాయి.
