హైదరాబాద్, వెలుగు : బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయా వతి వచ్చే నెల 7న రాష్ట్రానికి రానున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై రాష్ట్ర బీఎస్పీ నేతలు దృష్టి సారించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాయావతి మొదటిసారి తెలంగాణకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని బీఎస్పీ భావిస్తున్నట్లు తెలిసింది.
