రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

రీసర్వేతో భూ సమస్యలు పరిష్కారం: మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్​ టౌన్/ చిన్నశంకరంపేట, వెలుగు :   భూముల రీసర్వేతో ఏండ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలు పరిష్కారమై నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుందని, అక్రమ పట్టాలు రద్దవుతాయని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురువారం కోంటూరులో నిర్వహించిన ‘భూభారతి రీసర్వే’ గ్రామసభలో ఆమె మాట్లాడారు. అనంతరం చిన్నశంకరంపేటలోని ఎస్సీ బాలుర హాస్టల్‌‌‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు.

ఆ తర్వాత నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం సర్ ప్రక్రియ పూర్తయిందని, ఓటరు జాబితా సవరణలో పూర్తి పారదర్శకత వహించాలని సూచించారు. మృతి చెందిన, రెండు చోట్ల ఉన్న, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో సరిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.