- డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్
నర్సాపూర్, వెలుగు : పార్టీకి వ్యతిరేకంగా బరిలో ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సస్పెండ్ చేస్తామని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు.నర్సాపూర్ పట్టణంలోని 6,7వ వార్డుల్లో సోమవారం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజి రెడ్డి పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ,కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమంతో లబ్ది చేకూరుతుందని అన్నారు.
నర్సాపూర్ పట్టణ సమగ్ర అభివృద్ధి,సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ముందుకు వెళ్తున్నామని, ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని తద్వారా మున్సిపాలిటీకి మరింత అభివృద్ధికి దోహదం పడుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, రెడ్డిపల్లి సర్పంచ్ పద్మావతి అశోక్ గౌడ్, సుధీర్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.
