
మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి,పాతకక్షల వల్లే అనిల్ ను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డిగా గుర్తించారు. హత్యకు గురైన అనిల్ గతంలో రవీందర్ రెడ్డి అనుచరుడిగా ఉండేవాడు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు. ఈ కేసులో ఏ 1 కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి. ఏ2 నాగరాజు, ఏ 3 నాగభూషణం చేర్చారు పోలీసులు
మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు చెప్పిన వివరాల ప్రకారం.. జులై 14న రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ ను మెదక్, సంగారెడ్డి రూట్లో కొల్చారం మండల పరిధిలోని వరిగుంతం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ కేసులో ఏ 1 కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి. ఏ2 నాగరాజు, ఏ 3 నాగభూషణం చేర్చారు పోలీసులు. ఈ ముగ్గురికి అనిల్ అంటే ద్వేషం ఉంది. అనిల్ హైదరాబాద్ సహా పలుచోట్ల ల్యాండ్ సెటిల్ మెంట్లు చేశాడు. కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి అతని భార్య లక్ష్మీ లకు అనిల్ అనుచరుడిగా ఉన్నారు. లక్ష్మీ మరణం తర్వాత రవీందర్ రెడ్డికి, అనిల్ కు విభేదాలు వచ్చాయి. పెట్రోల్ బంకు విషయంలో ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. రవీందర్ రెడ్డి కి సంబంధించిన 12 ఎకరాల భూమి విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఉంది. గ్రామంలోనూ తనపై అనిల్ దుష్ప్రచారం చేస్తున్నారని రవీందర్ రెడ్డి కోపం పెంచుకున్నాడు. మరో ఇద్దరు నాగభూషణం, నాగరాజులకు కూడా అనిల్ తో గొడవలు ఉన్నాయి.
అనిల్ తో పాటు శేఖర్, నాగభూషణం అనే వ్యక్తి జులై14న గాంధీ భవన్ కి వెళ్లారు. హైదరాబాద్ లో ఓ సెటిల్ మెంట్ కోసం ముగ్గురు కలిసి వెళ్లారు. హత్య జరిగే వరకు నిందితులు అనిల్ తోనే ఉన్నారు. ఓ ఆల్టో కారు, మరో కారులో అప్పటికే అనిల్ ని హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. వరిగుంతం వద్ద షాబుద్దిన్ అనే వ్యక్తి అనిల్ పై కాల్పులు జరిపి హత్య చేశారు. అనిల్ హత్యకు ప్రధాన కారణం పాత కక్షలు, విబేధాలు. ఒక్కప్పుడు అనిల్ స్నేహితులే శత్రువులయ్యారు. ఈ కేసులో ఐదుగురు నిందితులని అరెస్ట్ చేశాం. ఇద్దరు పరారీలో ఉన్నారు. వారిని త్వరలో పట్టుకుంటాం అని ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.