తాడ్వాయి, వెలుగు: మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలను వరుస లైన్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో నూతనంగా గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెలు స్టోన్ పిల్లర్ తో దాదాపు పూర్తి చేశారు.
గద్దెల చుట్టూ చేయనున్న సాలారం పనులను సిమెంటు కాంక్రీట్ తో పూర్తి చేశారు. శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆళ్లగడ్డలో ఆదివాసీలకు సంబంధించిన మూడు నుంచి ఏడు గొట్ల బొమ్మలతో తయారు చేసిన సాలారం మెయిన్ గేట్ స్టోన్ పిల్లర్ ను ఏర్పాటు చేశారు.
