14 మందితో మేడారం ట్రస్ట్ బోర్డు.. కమిటీలో 13 మంది మహిళలకు చాన్స్‌‌

14 మందితో మేడారం ట్రస్ట్ బోర్డు.. కమిటీలో 13 మంది మహిళలకు చాన్స్‌‌

ములుగు / తాడ్వాయి, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్‌‌ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అందులో మహిళలకే ప్రాధాన్యం దక్కింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. ఇందులో 13 మంది మహిళలే ఉన్నారు. మహిళలకు ఈ స్థాయిలో ప్రాధాన్యం దక్కడం మేడారం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావుకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫీషియో సభ్యుడిగా కమిటీలో స్థానం దక్కింది. ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు సభ్యులు శనివారం మేడారంలో మంత్రి సీతక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా ఈ నెల 28 నుంచి 31 వరకు జరుగనున్న మహాజాతరలో తమ సేవలు అందించనున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మేడారం జాతర నిర్వహణలో సభ్యులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డులో మహిళలకు ప్రాధాన్యం కల్పించడం సంతోషకరం అన్నారు.

ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇర్ప సుకన్య..

మేడారం సమ్మక్క సారలమ్మ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డు చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇర్ప సుకన్య సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నియామకం అయ్యారు. సభ్యులుగా గీకురు భాగ్య, మైపతి రచన, సూదిరెడ్డి జయమ్మ, పాయం రమణ, పులుసం పుష్పమ్మ, గుంటోజు పావని, పొడెం రాణి, జనగాం గంగా లక్ష్మి, భూక్య వసంత, ఇజ్జిగిరి మమత, గంటమారి భాగ్యలక్ష్మి, చింత చంద్రావతితో పాటు పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావును సభ్యులుగా నియమించారు. ట్రస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో ఎండోమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈవో వీరస్వామి, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయకులు, పూజారులు పాల్గొన్నారు.