మైనర్ పై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష..మేడ్చల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు

మైనర్ పై అత్యాచారం.. వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష..మేడ్చల్ పోక్సో  కోర్టు సంచలన తీర్పు

మేడ్చల్ మల్కాజ్ గిరి: పోక్సో కేసులో మేడ్చల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు చెప్పింది. రెండేళ్ల కిందటి మైనర్ పై అత్యాచారం కేసులో  వ్యక్తిని దోషిగా  తేల్చిన కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పదివేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. 

2024 లో మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలోని జవహర్ నగర్ లో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం కేసు లో మేడ్చల్ పోక్సో కోర్టు  సంచలన తీర్పు చెప్పింది.  చిన్నారిపై యూపీకి చెందిన పర్వేష్ యాదవ్ అనే వ్యక్తి  అత్యాచారం ఆరోపణలతో పర్వేష్ యాదవ్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  అదే సంవత్సరం డిసెంబర లో అరెస్ట్ అయిన నిందితుడు చర్లపల్లి లో జైలులో ఉన్నాడు. 

చిన్నారిపై లైంగిక దాడి చేసినట్లు నేరం రుజువు కావడంతో మేడ్చల్ కోర్టు  పర్వేష్ యాదవ్ ను దోషిగా తేల్చింది.శుక్రవారం  (మే29) ఇచ్చిన తీర్పులో దోషిగా తేలిన పర్వేష్ యాదవ్ కు 20ఏళ్ల కఠిన జైలు శిక్ష వేసింది. దీంతోపాటు 10వేల రూపాయల జరిమాని విధించింది. మైనర్లపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని కోర్టు హెచ్చరించింది.