పద్మారావునగర్,వెలుగు: ధూమపానం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని నిపుణులు పిలుపునిచ్చారు. నో స్మోకింగ్ డే సందర్భంగా బుధవారం కవాడిగూడలోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో మీడియా వర్క్‌షాప్ నిర్వహించారు.
పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి డాక్టర్ శ్రీగణ, ఎన్‌టీఈపీ అధికారి జితేంద్ర ధూమపానం వల్ల కలిగే అనర్థాలు, క్షయవ్యాధి ముప్పుపై వివరించారు. కార్యక్రమంలో విజిలెన్స్ తహసీల్దార్ రఘునందన్, పీఐబీ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
