గోల్డ్ బౌట్కు మీనాక్షి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌ ఫైనల్కు ఇండియా బాక్సర్

గోల్డ్ బౌట్కు మీనాక్షి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌ ఫైనల్కు ఇండియా బాక్సర్

లివర్‌‌‌‌‌‌‌‌పూల్: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బాక్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీనాక్షి హుడా ఫైనల్‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. శనివారం (సెప్టెంబర్ 13) జరిగిన  విమెన్స్‌‌‌‌‌‌‌‌ 48 కేజీ సెమీ -ఫైనల్లో 5–-0తో  మంగోలియాకు చెందిన లుత్సైఖనీ అల్టాన్‌‌‌‌‌‌‌‌సెట్సెగ్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. 

స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే సూపర్ పెర్ఫామెన్స్ చేసిన ఇండియా అమ్మాయి పవర్ ఫుల్ పంచ్‌‌‌‌‌‌‌‌లతో ప్రత్యర్థిపై విరుచుకుపడింది. గోల్డ్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగే ఫైనల్ బౌట్‌‌‌‌‌‌‌‌లో కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌కు చెందిన నజిమ్‌‌‌‌‌‌‌‌తో మీనాక్షి తలపడనుంది