కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో మెగా జాబ్ మేళా

కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ లో మెగా జాబ్ మేళా
  • పాల్గొన్న10కి పైగా కంపెనీలు
  • ఎంపికైన 70 మంది విద్యార్థులు

ముషీరాబాద్, వెలుగు : బాగ్ లింగంపల్లిలోని కాకా బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కు చెందిన ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో10కి పైగా కార్పొరేట్ కంపెనీలు రిలయన్స్, జీవీకే, 24/7, రామ్ గ్రూప్, టీం ప్లీజ్ తదితర సంస్థలు పాల్గొన్నాయి. 250 మంది విద్యార్థులు హాజరవగా.. కంపెనీ ఇంటర్య్వూల్లో 70 మంది తమ ప్రతిభను చాటుకుని అర్హత సాధించారు.

చదువు పూర్తయిన తర్వాత జాజ్ కోసం తిరగడంతో సమయం, డబ్బు వృథా అవుతాయని పలువురు విద్యార్థులు తెలిపారు. చదువుకునే చోటనే  జాబ్ మేళాలు నిర్వహిస్తే ఇంటర్వ్యూల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు.. ఎలా ప్రిపేర్ కావాలి.. కంపెనీల స్టాడ్ ఉంటో తెలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా భయం లేకుండా ఇంటర్వ్యూలను ఎలా ఫేజ్ చేయాలో విద్యార్థులకు కూడా చక్కటి అవగాహన వస్తుందని విద్యార్థులు అభిప్రాయాలు వ్యక్తంచేశారు.  

మెగా జాబ్ మేళా ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికితీసి అవకాశాలను వినియోగించుకుంటూ విజయం సాధించాలని ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ చాగంటి శ్రీనివాస్ సూచించారు. ఈ మేళాలో కంపెనీల ప్రతినిధులు, అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్  డైరెక్టర్, ప్రిన్సిపల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.