- ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : మెగా జాబ్‌మేళాతో 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ‘1ఎం 1బీ’ సంస్థ, కుంభం ఫౌండేషన్ మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జాబ్‌మేళాను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ జాబ్ మేళాలో 25 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.
అప్లికేషన్లను ముందుగా స్క్రీనింగ్ చేస్తామని, ఈ నెల 10న ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని చెప్పారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, డిప్లొమా, ఇతర అర్హతలు కలిగిన యువతకు ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
