హైదరాబాద్‌‌లో డిసెంబర్ 14న మెగా రెసోఫాస్ట్

హైదరాబాద్‌‌లో డిసెంబర్ 14న మెగా రెసోఫాస్ట్

గచ్చిబౌలి, వెలుగు: ప్రతిభను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో రెసోనెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో డిసెంబర్ 14న ప్రతిభా ప్రోత్సాహక పరీక్ష మెగా రెసోఫాస్ట్ నిర్వహిస్తున్నట్లు రెసోనెన్స్ ఇన్‌‌స్టిట్యూషన్స్ తెలంగాణ, ఏపీ ఎండీ పూర్ణచంద్రరావు ప్రకటించారు. 

ఈ టాలెంట్​ టెస్ట్​ నగరంలోని 50కి పైగా కేంద్రాల్లో ఉంటుందని పేర్కొన్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్​ ఫస్టియర్​ విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులని తెలిపారు. ప్రతిభ చాటిన వారికి ఉచిత విద్యతో పాటు రూ.100 కోట్ల విలువైన స్కాలర్‌‌షిప్‌‌లు, టాప్ ర్యాంకర్లకు 100 ట్యాబ్‌‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.