ఆ పుస్తకం ఆధారంగానే చిరంజీవి సినిమా

ఆ పుస్తకం ఆధారంగానే చిరంజీవి సినిమా

స్టార్ హీరో సినిమా అనగానే కథ ఏమై ఉంటుంది, అందులో హీరో పాత్ర ఎలా ఉంటుంది అంటూ ఆరాలు తీస్తుంటారు ప్రేక్షకులు. ‘ఆచార్య’ సినిమా విషయంలోనూ అంతే. చిరంజీవి, రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌లతో కొరటాల శివ తీస్తున్న ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ చివరికి ఫిబ్రవరి 4కి ఫిక్సయ్యింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోజున వస్తుందా రాదా అనే అనుమానాలు మొదలయ్యాయి. టీమ్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రెగ్యులర్ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌తో అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బైటికి వచ్చిన ఓ వార్త ఈ మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచేస్తోంది. దేవాదాయ శాఖలోని అక్రమాల బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ సినిమా ఉంటుందని మొదట్నుంచీ చెబుతున్నారు. అయితే ఇది ‘సుబ్బారావు పాణిగ్రాహి’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారనేది రీసెంట్‌‌‌‌ టాక్.

ఒరిస్సాకి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి.. శ్రీకాకుళం జిల్లా, బొడ్డపాడులో ఉన్న శివాలయంలో పూజారిగా ఉండేవాడట. ఆయన భూస్వాములకు, దేవాదాయ శాఖలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాడాడట. ఇద్దరు నక్సలైట్లు ఆయన ఉద్యమానికి సపోర్ట్‌‌‌‌గా నిలిచారట. వీళ్లిద్దరూ టీచర్లుగా పని చేస్తూ అక్కడి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారట. ఆ సుబ్బారావు జీవితం ఆధారంగా రాసిన పుస్తకంలోని థీమ్‌‌‌‌ని తీసుకుని, చిన్న చిన్న మార్పులతో ‘ఆచార్య’ను తెరకెక్కించారంటూ ప్రచారం జరుగుతోంది. చిరు, చరణ్ నక్సలైట్ పాత్రల్ని పోషిస్తున్న సంగతి ఆల్రెడీ తెలిసిందే. దాన్నిబట్టి ఈ వార్తల్లో నిజం ఉండొచ్చనేది అందరి ఫీలింగ్. అయితే గతంలో కూడా ఈ సినిమా కథపై కొన్ని రూమర్స్ వస్తే నిజం కాదంటూ కొట్టి పారేశారు నిర్మాతలు. మరి ఈసారి ఎలా రియాక్టవుతారో చూడాలి.