మీ కష్టం చూస్తుంటే అమ్మ కష్టం గుర్తుకొస్తోంది

మీ కష్టం చూస్తుంటే అమ్మ కష్టం గుర్తుకొస్తోంది

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో ఉమెన్స్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా సినిమా మరియు టీవీ ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ ను చిరంజీవి, ఆయన  సతీమణి సురేఖ చీరలనుపంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. మహిళల శ్రమను గుర్తించడానికి ఈరోజు సరైన రోజు అనిపించింది, అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. మీ అందరి కష్టం చూస్తుంటే మా అమ్మ కష్టం గుర్తుకు వస్తుందన్నారు. చిన్నప్పుడు నుంచి అమ్మ పడే కష్టం ఏంటో తనకు తెలుసన్నారు. 

తన తల్లి కష్టం తెలుసు కాబట్టి, అందరి కోసం ఈ చిరుసత్కారం ఏర్పాటు చేశామన్నారు. సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి తన భార్య సురేఖ కారణమన్నారు. ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా సురేఖ చూస్కుంటుందన్నారు. సినిమాలతో తాను బిజీగా ఉన్నప్పుడు, తమ్ముళ్లను ఇంట్లో పిల్లలను సురేఖయే చూసుకుంటుందన్నారు చిరంజీవి. మహిళలు అంతరిక్షం వరకు వెళ్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గుర్తించాలన్నారు. ప్రపంచమంతా గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలన్నారు మెగాస్టార్. అమ్మాయిలను బాగా చదివించాలన్నారు. 

ఇవి కూడా చదవండి:

హాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన ఆలియా

ట్రైలర్‌‌‌‌‌‌‌‌ చూసి బోల్డ్‌‌‌‌గా ఉందంటున్నారు: ఎస్తేర్ నొరోహా