మెహిదీపట్నం, వెలుగు: దిగంబర్ జైన్ సోషల్ గ్రూప్, దిగంబర్ జైన్ సంస్థ ఆధ్వర్యంలో, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఆదివారం ఆగాపురాలోని మహావీర్ భవన్, దిగంబర్ జైన్ దేవాలయంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికిపైగా మహిళలు పరీక్షలు చేయించుకున్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ రేడియేషన్ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ వి.ఎస్.సాయి సంకల్ప్ నాయుడు, సదరన్ జెమ్ హాస్పిటల్
గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా అగర్వాల్ శిబిరాన్ని ప్రారంభించారు. శరీరంలో కొత్తగా గడ్డలు ఏర్పడటం లేదా అసాధారణ రక్తస్రావం జరగడం క్యాన్సర్ సంకేతాలుగా పరిగణించాలని సూచించారు.
