
బషీర్బాగ్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాదవులకే సీటు కేటాయించాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు కోరారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే మెజార్టీతో అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పారు.
సమితి ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు నిధులు కేటాయించాలన్నారు.