చట్టం ముందు అంతా సమానమే. ఆడ, మగ తేడా లేదు. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా పౌరులంతా సమాసమనే చెబుతోంది. కానీ.. చట్టాల అమలులో.. న్యాయ విచారణలో మగవాళ్లకు అన్యాయం జరుగుతోందని న్యాయకోవిదుల అభిప్రాయం. ముఖ్యంగా స్త్రీల సంక్షేమం కోసం రూపొందించిన చట్టాలు మగవాళ్లను ఏ ఆధారం లేకుండా (కేవలం ఆరోపణల ఆధారంగా) దోషులుగా నిర్ధారిస్తున్నాయన్న వాదనలు ఉన్నాయి. కష్టాలు, కన్నీళ్లకు లింగ భేదం ఉండదు. మగాళ్లకూ అవి ఉంటాయి. సగటు మనుషులుగా పురుషులకూ. హక్కులు ఉంటాయి. సమాజంలో అందరూ బాగుండాలంటే పురుషులు కూడా బాగుండాలి. మిగతా ప్రపంచానికి ఈ విషయాన్ని చాటి చెప్పడమే మెన్స్ డే యునెస్కో సెంట్రల్ హాల్ కనిపించే బోర్డుపై ఈ ఆక్షరాలు కనిపిస్తాయి.
మెన్స్ డే అనేది లింగ సమానతను అలవర్చేర.. ఒక అద్భుతమైన ఆలోచన, మగవాళ్ల కష్టాలను గుర్తించి, వాళ్లహక్కులు, అవసరాలు, ఆరోగ్యం.. ఇలా లోతైన ఆలోచల్ని పాశ్చాత్య దేశాలు తొంభై దశకంలోనే చేశాయి. కానీ.. భారతదేశంలో మాత్రం ఈ దినోత్సవానికి ప్రాధాన్యం చాలా తక్కువ. చాలా మంది మగవాళ్లకు అలాంటి రోజు ఒకటి ఉంటుందనే తెలిసి ఉండకపోవచ్చు, ప్రచారలోపం ముఖ్య కారణమైతే.. మగవాళ్లలో ఐక్యత లేకపోవటం, మహిళా పక్షపాతం వంటి ఇతర కారణాలంటారు మేధావులు. మగవాళ్లపై సానుకూలతతో పాటు.. మన ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. రుమానియా దేశం అయితే మెన్స్ డేను అధికారికంగా నిర్వహించుకునేందుకు పార్లమెంట్ లో ఏకంగా తీర్మానం చేసుకుంది. మరి కొన్ని దేశాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. మన భారతదేశంలో మాత్రం మెన్స్ డే అనేది చాలా చాలా చిన్న విషయం.. అసలు మగాళ్లకే అవసరం లేని ఒక రోజుగా మిగిలిపోయింది.
ALSO READ : కొడుకుగా.. భర్తగా.. అన్నగా.. నాన్నగా.. జీవితమంతా తన వాళ్ల కోసమే బతికే మగ మహానుభావులు..!
మన దేశంలో కొందరు మగాళ్లే.. మెన్స్ డేను ఓ జోక్ గా అభివర్ణిస్తుంటారు. అయితే జెంటిల్మెన్లు మాత్రం మరో రకంగా చెబుతున్నారు. మహిళలకు ఉన్నట్లే.. పురుషులకు ఓ రోజు కచ్చితంగా అవసరమేనని పురుష సంక్షేమ ఉద్యమకారులు వాదిస్తుంటారు. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని.. ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని వాళ్లు కోరుతున్నారు. కొన్ని ఎన్జీవోలు మన దేశంలో మెన్స్ డేని ఘనంగా నిర్వహిస్తున్నాయి. మార్పును ఆశిస్తున్న కొందరు ఆడవాళ్లు ఈ డేలో పాలుపంచుకుంటుండడం విశేషం. మహిళలు తమ రోజుని ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో.. సమస్యల గురించి ఎంత బాగా చర్చిస్తారో.. మెన్స్ డే రోజు కూడా మగవాళ్లు కూడా అదే స్థాయిలో చర్చించాలి అన్నది కొందరు జెంటిల్మెన్ల అభిప్రాయం.
మరి మీరు ఈ జెంటిల్మెన్లలో ఉన్నారా లేదా.. ఉంటే మీ కోసం.. మగ జాతి కోసం ఈ ఒక్క రోజు అయినా ఆలోచించండి..
