
ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు రోడ్లు ఊడుస్తున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియో లో నెత్తిమీద పోలీస్ క్యాప్ లేని ఓ లేడీ ట్రాఫిక్ పోలీస్, ఓ మగ పోలీస్ ఇద్దరూ సీరియస్ రోడ్డు పైన ఏదో పడిపోతే కలెక్ట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. బెంగుళూరులో కువెంపు సర్కిల్ దగ్గర అండర్ పాస్ దగ్గర తీసిన వీడియో అది. రోడ్డుపై ఉన్న ఇనుప మేకులను పనిగట్టుకొని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? అక్కడికి మేకులు ఎలా వచ్చాయి.. దీని వెనక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసుకుందాం రండి..
కువెంపు సర్కిల్ దగ్గర ఉన్న అండర్ పాస్ నుంచి వెళ్తున్న వాహనాలు అనుకోకుండా పంక్ఛర్లు అవుతున్నాయని వాహనదారులు ఇచ్చిన కంప్లైంట్ తో ట్రాఫిక్ పోలీసులు ఈ తక్షణ చర్యలు చేపట్టారు. అండర్ పాస్ దగ్గర రోడ్డు పై విసిరిన ఇనుప మొలలు ఎంతో శ్రమించి ఒక్కొక్కటికిగా కలెక్ట్ చేశారు ట్రాఫిక్ పోలీసులు.. దీని వెనక ఎవరున్నారు.. ఎందుకీ మేకులు విసిరారు అనే కోణంలో ఆరా తీస్తే.. ట్రాఫిక్ పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. వాహనాలకు పంక్చర్ చేసే లక్ష్యంతో పలుచోట్ల మెటల్ మేకులు విసిరినట్లు తెలిసింది. దీన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వాటిని తొలగించి వాహన దారుల ప్రయాణానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేశారు.
ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ... వాహనదారులకు ఇబ్బందులు కలిగించేందుకే ఇనుప మేకులు విసిరారని.. దోషులకు కఠినం శిక్షించాలని , ఇలాంటి చర్యలు సరియైనవి కావు అని మండిపడ్డారు. ఇక పోలీసులు చేసిన పనికి వారిని తెగ పొగిడేస్తున్నారు. కొంతమంది తమ వ్యాపారాన్ని పెంచుకునే లక్ష్యంతో సమీపంలోని మోటారు రిపేర్ షాపులు లేదా పంక్చర్ వాలాలు ఈ పనికి తెగబడి ఉంటారని చెప్పుకొచ్చారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు.. ఉద్దేశ్య పూర్వకంగా చేసిన ఈ చర్యకు పాల్పడిన నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.