తెలంగాణలో ఆరు జిల్లాల్లో భారీవర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణలో ఆరు జిల్లాల్లో భారీవర్షం.. ఎల్లో అలెర్ట్ జారీ

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో రెండు గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం వరకు హాట్ హాట్ గా ఉన్న వాతావరణం సాయంత్రానికి చల్లబడి వానలు పడుతున్నాయి. ఆదివారం ( మే25) కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని చోట్లు భారీవర్షాలు, మరికొన్ని చోట్ల  మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలెర్ట్ జారీ చేసింది. 

తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. 

ALSO READ | Rain Alert: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం.. హైదరాబాద్ లో కూడా..

ఆదివారం తెలంగాణలోని 13 జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి - భోంగిర్, జనగాం, సిద్దిపేట, జగిత్యాల, ఖమ్మం, ములుగు జిల్లాల్లో మరో 2గంటల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరం, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా వానలు పడే ఛాన్స్ ఉంది. ఆదివారం సాయంత్రం, -రాత్రి సమయంలో హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.