సీఎం, స్పీకర్‌ను విమర్శించే నైతిక హక్కు మెతుకు ఆనంద్ కు లేదు

సీఎం, స్పీకర్‌ను విమర్శించే  నైతిక హక్కు మెతుకు ఆనంద్ కు లేదు
  •     కాంగ్రెస్​ నేత రాజశేఖర్​రెడ్డి ఫైర్

వికారాబాద్​, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి, స్పీకర్‌ గడ్డం ప్రసాద్​ కుమార్​ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్​కు లేదని కాంగ్రెస్ వికారాబాద్​ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి మెతుకు ఆనంద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్​చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.