
వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా మహర్షి. ఈ మూవీ రిలీజ్ విషయంలో మరింత వెనక్కి తీసుకెళ్తున్నారు యూనిట్ సభ్యులు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన మహర్షి కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా కచ్చితంగా 25నే విడుదల చేస్తామని ఇటీవల క్లారిటీ ఇచ్చింది యూనిట్. ఇప్పుడు సినిమా మళ్లీ వాయిదా పడినట్లు నిర్మాత దిల్‌రాజు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ట్వీట్ చేశాడు. మార్చి 17కి టాకీ పార్ట్ పూర్తవుతుందని.. మరో రెండు సాంగ్స్ షూట్ మిగిలుందని తెలిపాడు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. హీరో అల్లరి నరేశ్ కూడా నటిస్తున్నాడు.
#Maharshi Releasing on May 9th
https://t.co/zFKrFQVfLT #మహర్షిమే9నవిడుదల#MaharshiOnMay9th@urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP @KUMohanan1
— Sri Venkateswara Creations (@SVC_official) March 6, 2019