మన మిసైల్ మన చాపర్ నే కూల్చింది

మన మిసైల్ మన చాపర్ నే కూల్చింది

భారత వాయుసేన (IAF) ప్రయోగించిన మిసైల్ మన చాపర్ నే కూల్చింది. ఈ ఘటన… బాలాకోట్ దాడులకు ప్రతీకారంగా పాక్ లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత వాయు సేన జరిపిన దాడిలో జరిగింది. ఇందులో Mi-17అనే హెలికాప్టర్ ను IAF కోల్పోయింది. ఈ విషయాన్ని శుక్రవారం సాయంత్రం ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్.కే.ఎస్. బధూరియా మీడియాకు చెప్పారు. ఈ ప్రమాదంలో ఆరుగురు IAF ఆఫీసర్లు, ఒక సివిలియన్ (గ్రౌండ్ పై ఉన్నాడు ఆ ప్రమాదం జరిగినపుడు) మృతిచెందారు. కోర్ట్ ఆఫ్ ఎక్వైరీ ముగిసిందని అందుకే మీడియాకు తెలుపుతున్నామని చెప్పారు.  అధికారుల మధ్య సమాచార లోపం ఏర్పడడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆ అధికారులపై చర్యలు తీసుకోనున్నామని తెలిపారు.