
పీసీసీ నేతల విమర్శలపై కాంగ్రెస్ నుంచి TRSలో చేరిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు. నాయకత్వ లేమితోనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని.. దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్యేలు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తామన్నారు.