జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్‌ రషీద్‌ ఫరాజ్‌

జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా  మహ్మద్‌ రషీద్‌ ఫరాజ్‌

జూబ్లీహిల్స్ ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్‌ రషీద్‌ ఫరాజ్‌ ను ప్రకటించింది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్  పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.  ప్రస్తుతం రషీద్ షేక్ పేట కార్పొరేటర్ గా ఉన్నారు.ఎంఐఎం  హైదరాబాద్ లో   9 స్థానాల్లో పోటీచేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ రెండు సార్లు గెలిచారు. ఇపుడు మూడోసారి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్ది పోటీ చేయగా ఓటమిపాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ముస్లీం ఓట్లు కీలకం కానున్నాయి. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఎవరికి వేస్తే వారే గెలుస్తారని నమ్మకం. అందుకే ఎంఐఎం అభ్యర్థిని బరిలోకి దించినట్లు తెలుస్తోంది.

మరో వైపు కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ను ఓడించేందుకే ఎంఐఎం అభ్యర్థిని ప్రకటించిందనే వాదన ఉంది. మైనారిటీ ఓట్లు చీలకుండా బరిలోకి దిగుతుందనే ప్రచారం ఉంది.