మైండ్ స్పేస్ ఉద్యోగినికి కరోనా లేదు: ఈటల

మైండ్ స్పేస్ ఉద్యోగినికి కరోనా లేదు: ఈటల

కరోనా వైరస్ పై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు మాత్రమే పాజిటివ్ గా తేలిందన్నారు. అది కూడా దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి మాత్రమేనని స్పష్టం చేశారు.

కరోనా తెలంగాణాలో పూర్తి నియంత్రణలో ఉందన్న మంత్రి  ఈటల… ఇటలీ నుంచి వచ్చిన మైండ్ స్పేస్ ఉద్యోగినికి కరోనా సోకలేదన్నారు. మైండ్‌స్పేస్‌ ఉద్యోగికి కరోనా నెగిటివ్‌ వచ్చిందన్నారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బెంగళూరు ఉద్యోగి, హైదరాబాద్ మహేంద్ర కాలనీ నివాసి కరోనా నుంచి బయటపడ్డారని, అతడిని మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశార్జ్ చేస్తామని చెప్పారు. కొత్తగా తెలంగాణ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదన్నారు. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాప్తి చెందదని…  నోటి తుంపర్లు ద్వారా కళ్ళలో పడితే వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్రం తీసుకున్న చర్యలను చూసి కేంద్రం మెచ్చుకుందన్నారు.

కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందని చెప్పారు మంత్రి ఈటల. కరోనా టెస్టులు చేయించుకుంటామని కొందరు ఫోన్లు చేస్తున్నారన్నారు. అయితే అనుమానం…. డబ్బులు ఉంటే కరోనా టెస్టులు చేయడం కుదరదని చెప్పారు. వైరస్‌ లక్షణాలున్నట్లు డాక్టర్లు నిర్ధారిస్తేనే పరీక్షలు చేస్తామని స్పష్టం చేశారు.