పోలీసుల వాహనాన్నే ఢీ కొట్టిన మైనర్లు

పోలీసుల వాహనాన్నే ఢీ కొట్టిన మైనర్లు

హైదరాబాద్ : వచ్చిరాని డ్రైవింగ్ తో రోడ్డెక్కుతున్న కొందరు మైనర్లు..రాష్ డ్రైవింగ్ తో హల్ చల్ చేస్తున్నారు. శనివారం రాత్రి స్కూటీతో చక్కర్లు కొడుతూ వచ్చిన మైనర్లు..  పోలీసుల వాహనాన్నే ఢీకొట్టారు. స్కూటీపీ స్పీడ్ గా దూసుకెళ్తూ రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ కు చెందిన బొలెరొ కారును ఢీకొట్టారు.

బుద్వేల్ నుంచి షాహీన్ నగర్ కు వెళ్తూ మార్గమధ్యలో పోలీసుల కారును ఢీకొనడంతో స్కూటీ ముందు భాగం పాడైంది. ఈ ప్రమాదంలో స్కూటీ నడిపిన 16 ఏళ్ల కరీముద్దీన్, అతని సోదరుడు 14 ఏళ్ల రహిముద్దీన్ లకు తీవ్రగాయాలడంతో..వారిద్దరిని చికిత్స కోసం హస్పిటల్ కి తరలించారు పోలీసులు. మైనర్లకు వాహనాన్ని ఇచ్చినవారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు పోలీసులు.