జూన్​ 25న ఎన్ కన్వెన్షన్​లో ‘ఫ్యూజన్ ఫ్లీ మార్కెట్’

జూన్​ 25న ఎన్ కన్వెన్షన్​లో ‘ఫ్యూజన్ ఫ్లీ మార్కెట్’

హైదరాబాద్, వెలుగు:   షాపింగ్ ప్రియుల ను అలరించేందుకు ఆదివారం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ లో ‘మినీ వేగాస్ ఫ్యూజన్ ఫ్లీ మార్కెట్’ సీజన్-1 ప్రదర్శన ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నిర్విరామంగా అనేక ప్రోగ్రాంలను కండక్ట్ చేస్తామని వారు తెలిపారు. దేశంలో ప్రసిద్ధి పొందిన ముం బై నిపుణుల ఆధ్వర్యంలో ‘లెడ్ టార్న్ షో’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని.. థీరీ, ధ్వని, ధున్ మ్యూజిక్ బ్యాండ్ల ఆధ్వర్యం లో సంగీత ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు.

ఫ్లీ మార్కెట్ లో 100కుపైగా స్టాల్స్ ఏర్పాటు అవుతున్నాయని, వీటిలో నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తూ.. రుచికరమైన వంటలను ఆస్వాదిస్తూ రోజంతా సందడి చేయొచ్చన్నారు. అలాగే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, జ్యుయలరీ తయారీ, స్పిన్ ఆర్ట్, మిక్సాలజీ వంటి 10 అంశాలపై వర్క్ షాప్ లు కూడా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు.