శ్రీశైలం ఘటన ప్రపంచంలోనే మొదటి సారి..

శ్రీశైలం ఘటన ప్రపంచంలోనే మొదటి సారి..

శ్రీశైలంలో అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతుందన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. మండలిలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు జగదీష్ . చనిపోయిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సాయం, అర్హత కల్గిన బాధిత కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని జెన్కో  నిర్ణయించిందన్నారు. అయితే ప్రమాదంపై ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలో ముగ్గురికి కరోనా వచ్చిందన్నారు. అందుకే నివేదిక ఆలస్యం అవుతుందని తెలిపారు. పొగ కమ్మేయడంతోనే ఉద్యోగుల ప్రాణాలు పోయాయన్నారు.అధికారులను, సిబ్బందిని రక్షించేందుకు చివరివరకు ప్రయత్నం చేసామన్నారు. ఈ ఘటన ప్రపంచంలో మొదటిసారి జరిగిందని..ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.

అధిక ఫీజులు తీసుకున్న స్కూల్స్ కు మెమోలు

చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..

రవికిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు..ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీని నిందిస్తారా?